స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని సెట్విన్ సాంకేతిక శిక్షణ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు సెట్విన్ శిక్షణ సంస్థ ఇన్‌చార్జి ఎం.సరిత ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువతతీయువకులకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఎంఎస్ ఆఫీస్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్, ప్లంబర్, సెల్ రిపేరింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. కోర్సును బట్టి మూడు నెలల నుంచి ఏడాది పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. సాయంత్రం వేళలో వర్కింగ్ టీచర్స్‌కు ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన తర్వాత తమ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల ప్రతీక్‌రెడ్డి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల పక్కన గల సెట్విన్ సెంటర్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ : 97050 41789 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
రామాలయంలో పంచరత్న కీర్తనలు
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని రామగిరి సీతారామచంద్రస్వామి దేవాలయం సద్గురు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం సందర్భంగా శనివారం డాక్టర్ ఎం.పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో పంచరత్న కీర్తనలను నిర్వహించారు. సూర్య సిస్టర్స్ శ్రీమతులు కోమలి వినోద్, అవనిజ సతీష్, ఎన్‌సీ.పద్మ, తిరుమల మానస, జానకి వెంకటనారాయణ సంగీత కళాకారులు కీర్తనలు ఆలపించారు. అంతకుముందు నాదస్వర బృందంతో త్యాగరాజ స్వామి పటాన్ని ఊరేగిస్తూ నగర సంకీర్తన చేశారు. కార్యక్రమంలో త్యాగరాజ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఎం.జనార్దనాచార్యులు, లక్ష్మీనాథ్, అనంతాచార్య, వినోద్ కుమార్, శ్రీవాత్సవ, రాంప్రసాద్, అక్కినేపల్లి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
అర్హులకే రేషన్‌కార్డులు
నార్కట్‌పల్లి : అర్హులైన వారికి రేషన్‌కార్డు మంజురు చేసేందుకు జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అదికారి (డీఎస్‌ఓ)వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం నార్కట్‌పల్లి మండలంలోని గోపాలయపల్లిలో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన తిరుగుడు పద్మ బతికుండగానే.. చనిపోయిందని రేషన్‌కార్డు నుంచి తొలగించారని డీఎస్‌ఓకు ప్రజలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్‌ఓ మాట్లాడుతూ పూర్తిగా పరిశీలించి అర్హులైన వారికి పథకాలు అందేలా చూస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ ఉమేష్, దీపక్ తదితరులు ఉన్నారు.
తిరుగు ప్రయాణం.. రద్దీమయం
చిట్యాల: చిట్టాల పట్టణంలోని 65వ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లిన వారంతా శనివారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో చిట్యాల పట్టణంలో హైవేపై వాహనాలు బారులుదీరాయి. రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చిట్యాల ఎస్‌ఐ ఎన్.ధర్మా ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment