ముంబై మారథాన్‌లో విజేతగా నిలిచిన కిషన్
వలిగొండ: మండలంలోని పొద్దటూర్‌కు చెందిన దుబ్బ కిషన్ ముంబైలో ఆదివారం టాటా వారు నిర్వహించిన మారథాన్‌లో పాల్గొని 42.195 కి.మీ పరుగు పందాన్ని 4గంటల 20 నిమిషాల 17 సెకండ్లలో పూర్తి చేసి ప్రథమ స్థానాన్ని సాధించారు. హైదారాబాద్‌లో ఇంటెలిజెన్స్ కంట్రోల్ రూంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కిషన్ గతంలో హైదరాబాద్, ముంబై, కశ్మీర్ మారథాన్‌లో పాల్గొని మెడల్స్, ప్రశంసా పత్రాలు సాధించాడు. టాటా ముంబై మారథాన్‌లో విజేతగా నిలిచిన కిషన్‌కు పోలీస్ అధికారులు, మిత్రులు, బంధువులు అభినందనలు తెలిపారు.
బాలలను పనిలో పెట్టుకున్న
ఇద్దరిపై కేసు నమోదు
భూదాన్‌పోచంపల్లి: బాలకార్మికులను పనిలో పెట్టుకున్న ఇద్దరు షాపు యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీ వరల్డ్ షాపులో బిహార్ రాష్ట్రానికి చెందిన బాలకార్మికుడితో పాటు, సురేశ్ బైక్ మెకానిక్ షాపులో మరో బాలకార్మికుడు పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు షాపు యజమానులైన కొండాపురం భాస్కర్, చింతల సురేశ్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ప్రయాణికురాలికి
ల్యాప్‌టాప్ అందజేత
నార్కట్‌పల్లి: బస్సులోనే ఉండిపోయిన ప్రయాణికురాలి ల్యాప్‌టాప్‌ను ఆర్టీసీ సిబ్బంది తిరిగి బాధితురాలికి అందజేశారు. ఆదివారం ఖమ్మం నుంచి వస్తున్న అఖిల సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బస్సు దిగింది. ఈ క్రమంలో తాను తిరిగి వచ్చేటప్పటికీ బస్సు వెళ్లిపోవడంతో తన ల్యాప్‌టాప్ బస్సులోనే ఉందని సూర్యాపేట డిపో మేనేజర్‌కు తెలిపింది. మేనేజర్ ఈ విషయాన్ని నార్కట్‌పల్లి డిపో అధికారులకు తెలియజేయడంతో వారు ఆ బస్సును నార్కట్‌పల్లిలో ఆపి అందులో ఉన్న ల్యాప్‌టాప్ బ్యాగును తీసుకుని దానిని బాధితురాలికి అందజేసినట్లు డిపో ఇన్‌చార్జ్ ఎంవీ చారి, కర్నాటి శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment