ఆపదలో భరోసా
నేనున్నానంటూ..
34 సార్లు రక్తదానం చేశాను
కరోనా కాలంలో సకాలంలో రక్తం దొరకక ఎంతో మంది బాధితులు మృతిచెందడం నన్ను కలచి వేసింది. రక్తం దొరకక ఎవరూ మృతి చెందకుండా చూడాలనే ఆలోచనతో 2020లో మిత్రులతో కలసి ప్రాణదాత ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నేను ఇప్పటి వరకు 34 సార్లు రక్తదానం చేశాను. అత్యవసర సమయంలో ఫౌండేషన్ తరుపున 3వేల మందికి రక్తదానం చేశాం. మా స్నేహితులతో కలసి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి రక్త దాతల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుతున్నాం. మేము సంపాదించిన దానిలో నుంచి నెలనెలా కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తూ చేతనైనా సాయం చేస్తున్నాం.
– మేరుగుమళ్ల రాజ్, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు
●
కేతేపల్లి: కేతేపల్లి మండలంలోని తుంగతుర్తి గ్రామానికి చెందిన మేరుగుమళ్ల రాజ్ తన మిత్రులతో కలసి ప్రాణదాత ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే తక్షణమే స్పందిస్తూ వారిగా అండగా నిలుస్తున్నాడు.
ఒక్కడితో ప్రారంభమైన ఫౌండేషన్..
ఒక సంస్థగా ఏర్పడి సాయం చేస్తే బాగుంటుందని భావించిన రాజ్ 2020లో ప్రాణదాత ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. మొదట ఒక్కడితో ప్రారంభమైన ఫౌండేషన్ నేడు 200 మంది సభ్యులకు చేరుకుంది. అత్యవసర సమయంలో రక్తదానం చేయటం నుంచి ఆకలితో ఉన్న వారికి అన్నం సేకరించి అందజేయటం వరకు అన్ని రకాల సేవా కార్యక్రమాలను ప్రాణదాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. అదేవిధంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి దాతల నుంచి రక్తం సేకరిస్తున్నారు. జీవనోపాధి రీత్యా వివిధ వృత్తుల్లో కొనసాగుతూనే... ఆపదలో ఉన్నామని ఫోన్ చేసిన వారికి రక్తదానం చేస్తున్నారు.
సేవా కార్యక్రమాలు ఇలా..
● గర్భిణిలు, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు, అనారోగ్యంతో బాధపడుతున్న 3000 మందికి ఫౌండేషన్ తరుపున రక్తం ఇప్పించారు.
● ఫౌండేషన్ సభ్యులు తమ సంపాదన నుంచి ప్రతి నెలా రూ.200 జమచేసి, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన నిరుపేద చిన్నారులు, వృద్ధులు, వింతంతులకు ఆర్థికసాయంగా అందజేస్తున్నారు.
● ఇప్పటి వరకు 30 కుటుంబాలకు ఫౌండేషన్ తరుపున ఆర్థికసాయం చేశారు.
● శుభ కార్యాలయాల్లో మిగిలిన అన్నం, కూరలను సేకరించి అనాథలకు పంపిణీ చేస్తున్నారు.
● రోడ్డుపై ఒంటరిగా ఉన్న వృద్ధులు, పిల్లలను చేరదీసి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
● ప్రతి ఏటా వేసవిలో రహదారుల వెంట చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ వాహనదారుల దాహార్తి ని తీరుస్తున్నారు.
● ఇటీవల వర్షాలతో ఖమ్మం, విజయవాడ నగరాల్లో వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తుంగతుర్తి గ్రామానికి
చెందిన యువకుడు
ప్రాణదాత ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాల నిర్వహణ
ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు,
ప్రశంసా పత్రాలు అందుకున్న రాజ్
Comments
Please login to add a commentAdd a comment