‘లలిత శతకం’ పుస్తకావిష్కరణ
భూదాన్‌పోచంపల్లి: పట్టణ కేంద్రంలోని చేనేత టై అండ్ డై సిల్క్ చీరల ఉత్పత్తిదారుల సంఘం భవనంలో ఆదివారం జాతీయ తెలుగు సాహితీపీఠం (హైదరాబాద్) ఆధ్వర్యంలో పోచంపల్లికి చెందిన కవి వడ్డేపల్లి రాజేశ్వర్ రచించిన ‘లలితా శతకం’ పుస్తకాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ మాజీ అధ్యక్షులు, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు కసిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికుడైన వడ్డేపల్లి రాజేశ్వర్ సాహితీ సేవలను కొనియాడారు. అనంతరం జాతీయ తెలుగు సాహిత్యపీఠం అధ్యక్షుడు డాక్టర్ నలవోలు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఈనాటి పిల్లలకు పద్యాలు నేర్పుతూ శతకాలపై ఆసక్తి పెంచడానికి ఇలాంటి పుస్తకాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా సాహిత్యసేవా సంస్థ అధ్యక్షురాలు రావూరి వనజ, పద్య కవయిత్రి రాపోలు అరుణ స్వామి, రాజనీతి ఉపాన్యాసకులు పట్నం కృష్ణకుమార్, రిటైర్డ్ అధ్యాపకుడు రావిరాల స్వామి, సీత శ్రీరాములు, రావూరి కృష్ణకుమార్, డాక్టర్ పాండాల మహేశ్వర్, రుద్ర పాండురంగ శాస్త్రి, త్రివేణి సాహితీసంఘం అధ్యక్ష, కార్యదర్శులు గుంటి దయానంద్, గజ్జెల రామకృష్ణ, డాక్టర్ సుబ్బరామనాయుడు, విఘ్నేశ్వర్, చక్రాల నర్సింహ, మురళి, వెంకటేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment