లిఫ్ట్ పనులు వేసవిలోగా పూర్తి చేయాలి
పాలకవీడు: మండలంలోని జాన్‌పహాడ్ శివారు కృష్ణానదిపై రూ.173 కోట్లతో చేపట్టిన సాగునీటి లిఫ్ట్ నిర్మాణ పనులు వేసవిలోగా పూర్తి చేయాలని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. లిఫ్ట్ పనులను ఆదివారం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లిఫ్ట్‌కు జవహర్‌లాల్ జాన్‌పహాడ్ లిఫ్ట్‌గా నామకరణం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. లిఫ్ట్ నిర్మాణం పూర్తయితే సుమారు 5650 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పైప్‌లైన్ నిర్మాణానికి 20.23 హెక్టార్ల భూసేకరణ పూర్తయిందన్నారు. జాన్‌పహాడ్ సాగర మేజర్ ఎల్14 మైనరు కాల్వ వరకు పైప్‌లైన్ నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. బెట్టెతండా వద్ద మూసీనదిపై రూ.30 కోట్లతో మంజూరైన లిఫ్ట్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. శూన్యపహాడ్ వద్ద మూసీనదిపై గల లిఫ్ట్ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మండలంలో రూ.9 కోట్లతో పాలకవీడు నుంచి అలింగాపురం వరకు, రూ.14 క్టోలతో అలింగాపురం నుండి గరిడేపల్లి వరకు డబుల్ రోడు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో మిర్యాలగూడెం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, వక్ఫ్‌బోర్డు చైర్మన్ హుస్సేనీ, కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్, నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజనీర్ రమేష్‌బాబు, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌రావు, ఆర్డీఒ శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, జిల్లా నాయకులు మోతీలాల్, మండల అధ్యక్షుడు ఎన్‌వి.సుబ్బారావు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సప్పిడి నాగిరెడ్డి, నరసింహారావు, నీమానాయక్, నేరేడుచర్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొణతం చిన వెంకట్‌రెడ్డి, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ పాల్గొన్నారు.
ఉర్సు నిర్వహణపై అధికారులతో సమీక్ష
ఈ నెల 24నుంచి ప్రారంభమయ్యే జాన్‌పహాడ్ దర్గా ఉర్సుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రూ. 30 లక్షలు మంజూరు చేశారు. ఈ చెక్కులను వక్ఫ్‌బోర్డు అధికారులకు అందజేశారు. అనంతరం వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలీస్, పంచాయతీ రాజ్, ఫైర్, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య, ఎకై ్సజ్, ఆర్టీసీ అధికారులను సమన్వయం చేస్తూ నివేదికలు తెప్పించుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. అంతకుముందు జాన్‌పహాడ్ దర్గాలో పూజలు చేశారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్ హుస్సేనీ మాట్లాడుతూ.. దర్గాలో మౌలిక సదుపాయాలకు రూ.1.30 కోట్లతో ప్రతిపాదనలు అందాయని దీనిని త్వరితగతిన మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
భారీ నీటిపారుదల, పౌరసరఫరాల
శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
జాన్‌పహాడ్ శివారులో కృష్ణానదిపై నిర్మిస్తున్న లిఫ్ట్‌కు జవహర్‌లాల్ జాన్‌పహాడ్ లిఫ్ట్‌గా నామకరణం
Comments
Please login to add a commentAdd a comment