అసంతృప్తిని కప్పి పుచ్చుకునేందుకే ఎమ్మెల్యేలకు ఆఫర్
మోత్కూరు: సీఎం రేవంత్‌రెడ్డి తనపై వస్తున్న అసంతృప్తిని కప్పి పుచ్చుకోవడానికి కమీషన్ల కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల మేర పనులను ఆఫర్ ఇచ్చారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఆరోపించారు. ఆదివారం మోత్కూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేని అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే పోలీస్ కేసుల బనాయింపు, అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడమే ధ్యేయంగా రేవంత్‌రెడ్డి పని చేస్తున్నారన్నారు. ఈ ఫార్ములా అక్రమ కేసు బనాయించి కేటీఆర్‌ను అరెస్టు చేయాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు తుంగతుర్తి నియోజకవర్గంలో ఏ ఒక్క పైసా అభివృద్ధి పనులు చేయలేదన్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి, మంజూరు పనులను తిరిగి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నారని, శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. ఈ నెల 21న నల్లగొండలో జరిగే రైతు మహా ధర్నాకు రైతులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మినర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, కొణతం యాకూబ్‌రెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు పొన్నబోయిన రమేష్, కె.ప్రభాకర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు జంగ శ్రీను, కార్యదర్శి గజ్జి మల్లేషం, నాయకులు బయ్యని పిచ్చయ్య, సోంమల్లు, సత్యం గౌడ్, దాసరి తిరుమలేష్, బుషిపాక లక్ష్మి, దబ్బెటి శైలజ, ఇంద్రజ్యోతి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment