నాణ్యమైన ఆభరణాలు అందించాలి
మిర్యాలగూడ: వినియోగదారులకు నాణ్యత కలిగిన ఆభరణాలు అందించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని సాగర్‌రోడ్డులో లలిత జ్యువెలరీ షాపును ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. మిర్యాలగూడ పట్టణం, వ్యాపార రంగంలో దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడ అన్ని రకాల ప్రముఖ దుకాణాలు నెలకొంటున్నాయని, అందులో భాగంగా లలిత జ్యువెలరీ షాపు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. లలిత జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. లలిత జ్యువెలరీ షాపులో బంగారు నగలపై తరుగులో 2శాతం తగ్గింపు ఉంటుందని, వజ్రాభరణాలపై క్యారెట్‌కు రూ.6వేలు తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు. ఫ్రీ అండ్ ఫ్లెక్సీ 11 నెలల నగల కొనుగోలు పథకం వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేశామని తెలిపారు. వినియోగదారులు వాయిదాల పద్ధతిలో కూడా ఈ పథకంలో చేరవచ్చన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, స్థానిక కౌన్సిలర్ మహమ్మద్ ఇలియాస్, మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, గుడిపాటి శ్రీనివాస్, జైని ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment