![ప్రత్యేక తరగతుల్లో చదువుకుంటున్న విద్యార్థులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/18/16ndl04b-200121_mr_0.jpg.webp?itok=-wTy4_TZ)
ప్రత్యేక తరగతుల్లో చదువుకుంటున్న విద్యార్థులు
పదోతరగతి ఫలితాల్లో నిర్దేశిత లక్ష్యం చేరుకునేందుకు వంద రోజుల ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ ఇటీవల జిల్లా, మండల స్థాయి విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలో అమలు చేస్తున్న సెల్ఫ్ ప్రణాళిక కొనసాగింపుగా 100 రోజుల ప్రణాళిక చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ఉపాధ్యాయులు పాటించాల్సిన అంశాలను జిల్లా విద్యాశాఖ ప్రకటించింది.
● మొదటిగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ 100 రోజుల ప్రణాళికను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
● సబ్జెక్టు వారీగా ఏ సబ్జెక్టుకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో దానికి అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు స్వీయ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.
● తల్లిదండ్రులు, విద్యార్థులతో ఉమ్మడి సమా వేశాలు నిర్వహించి వందరోజుల ప్రణాళిక అమలు ప్రాధాన్యతను వివరించి వారిని సంసిద్ధం చేయాలి.
● సెల్ఫ్ పరీక్ష నిర్వహించిన వెంటనే మూల్యాంకనం చేసి విద్యార్థులకు అందజేయాలి. వారు చేసిన తప్పులను వివరించి నోట్స్‌లో సరైన సమాధానాలు రాసి పూర్తిస్థాయిలో సాధన చేయించాలి.
● సెల్ఫ్ టెస్ట్ పూర్తయిన తరువాత అన్ని సబ్జెక్టల్లో ఫలితాలను విశ్లేషించి ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించాలి. ఫలితాలు తక్కువ వచ్చిన సబ్జెక్టు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి అమలు చేయాలి.
● 100 రోజుల ప్రణాళికను తల్లి దండ్రులకు తెలియజేయడం కోసం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో విద్యార్థి ఇంటిని సందర్శించాలి.
● విద్యార్థులను దత్తత తీసుకున్న ఉపాధ్యాయుల తల్లి దండ్రులతో వారి ప్రగతి గురించి మాట్లాడిస్తూ మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడానికి వారిని భాగస్వామ్యం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment