పచ్చ నేతల బరి తెగింపు
● 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న
రేకుల షెడ్డు కూల్చివేత
● వైఎస్సార్‌సీపీ మద్దతుదారులని
కక్ష సాధింపు
● అధికారులపై ఒత్తిడి తెచ్చి
షెడ్డు కూల్చివేత
● పురుగు మందు తాగి ఆత్మహత్యా
యత్నానికి పాల్పడిన బాధితురాలు
● చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
● పెద్ద కొప్పెర్లలో టీడీపీ నేతల
అరాచకం
కోవెలకుంట్ల: కూటమి ప్రభుత్వం ఽఅధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల దౌర్జన్యాలు, అక్రమాలు, దోపిడీలు, బెదిరింపులకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. పచ్చ నేతలకు అధికారులు సైతం సలాం చేయాల్సి వస్తోంది. తాజాగా గురువారం పెద్దకొప్పెర్లలో టీడీపీ నాయకుల అరాచకానికి ఓ వృద్ధురాలు నిలువు నీడ కోల్పోయింది. బాధితులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ కుటుంబం 30 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి సేవ చేసినా ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయన కుమారుడు రియాజ్, అల్లుళ్లు రహంతుల్లా, అసరఫ్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అండగా నిలిచారు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నాయకులు గత ఎన్నికల్లో అధికారం దక్కడంతో ఆ కుటుంబంపై కక్ష గట్టారు. మహమ్మద్ రఫీ తల్లి ముల్లా కమరూన్‌బీ 30 ఏళ్లుగా ఉంటున్న రేకులషెడ్ ప్రభుత్వ స్థలమని టీడీపీ నేతలు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థలానికి సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే అందజేయాలని తహసీల్దార్ పవన్‌కుమార్‌రెడ్డి నోటీసులు జారీ చేశారు. 30 ఏళ్లుగా ఆ స్థలంలో రేకుల షెడ్‌లో ఉంటూ ఆ స్థలాన్ని కుమార్తె షంషాద్‌బీకి రిజిస్టర్ చేయించి ఇచ్చింది. ఈ వివరాల ఆధారంగా వృద్ధురాలి కుమారుడు మహమ్మద్ రఫీ కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ తీసుకొచ్చాడు. వీటిని పరిగణలోకి తీసుకోకుండా టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తేవడంతో ప్రొక్లెయిన్‌తో షెడ్‌ను కూల్చి వేయించారు.
Comments
Please login to add a commentAdd a comment