ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షలు ఇవ్వాలి
నంద్యాల (న్యూటౌన్): పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు వేలాది మంది అర్జీదారులతో ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దారు రామసంజీవయ్యకు వినతిపత్రం ఇచ్చారు. ఈసందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల సమయంలో పట్టణాల్లో రెండు, పల్లెటూళ్లలో మూడు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారం చేపట్టి ఆరు నెలలు గడిచినా ఇంతవరకు అతీగతీ లేదన్నారు. మరో ఆరు నెలల గడువు ఇస్తున్నామని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వలేనిపక్షంలో ఇల్లు లేని నిరుపేదలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, జిల్లా కార్యదర్శి రంగనాయుడు, మహిళా సంఘం నాయకురాళ్లు లక్ష్మ్మీదేవి, మాలన్‌బీ, సుశీలమ్మ, మున్ని తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment