రేకుల షెడ్‌ను కూల్చి వేస్తుండటంతో ముల్లా కమరూన్‌బీ ఇంట్లో ఉన్న క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వృద్ధురాలిని చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెంకటేశ్వరరెడ్డి తమ కుటుంబంపై కక్ష కట్టి షెడ్డు కూల్చివేయించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి షెడ్ కూల్చివేతను ఖండించారు. ఈ విషయమై ఈఓపీఆర్‌డీ ప్రకాష్‌నాయుడు మాట్లాడుతూ సామూహిక మరుగుదొడ్డి స్థలంలో ఉన్న అక్రమ కట్టడాన్ని నిబంధనల ప్రకారమే తొలగించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment