అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి! | - | Sakshi
Sakshi News home page

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి!

Published Sun, Oct 20 2024 1:44 AM | Last Updated on Sun, Oct 20 2024 1:44 AM

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి!

ఆళ్లగడ్డ: కూటమి ప్రభుత్వంలో అధికారుల పోస్టింగ్‌లు కుక్కలు చింపిన విస్తరిలా తయారవుతున్నాయి. ప్రజాప్రతినిధుల కక్ష సాధింపులతో కొందరు ఉద్యోగులు.. అధికారుల అత్యుత్సాహానికి మరికొందరు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆళ్లగడ్డ అగ్రి ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌ నాగేంద్రప్రసాద్‌ ఘటనే ఇందుకు ఉదాహరణ. రుద్రవరం వ్యవసాయాధికారి శ్రీకృష్ణపై తీసుకున్న చర్యలు ఆళ్లగడ్డ అగ్రి ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌ నాగేంద్రప్రసాద్‌కు ఇబ్బందిగా మారాయి. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు.. రుద్రవరం మండల వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ గతంలో అవుకు మండలంలో పని చేశారు. ఆ సమయంలో బనగానపల్లె టీడీపీ నాయకుడికి అతనికి ఏం జరిగిందో తెలయదు కానీ.. టీడీపీ నాయకుడు మాత్రం కక్ష గట్టాడు. ప్రస్తుతం ఆ నాయకుడు వ్యవసాయాధికారి శ్రీకృష్ణకు పనిష్మెట్‌ కింద ఒరిస్సా బోర్డర్‌కు వేయాలని సంబంధిత శాఖ మంత్రి ద్వారా వ్యవసాయాధికారులకు సిఫార్స్‌ చేయించారు. సదరు శాఖ అఽధికారులు జోన్‌ దాటి బదిలీ చేయడం నిబంధనలకు విరుద్ధమని తలచి తర్జనభర్జన పడ్డారు. జిల్లాలోనే పనిష్మెంట్‌ కింద ఏదైనా లూప్‌లైన్‌లో ఉంచాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆఘమేఘాల మీద అతడిని ఆళ్లగడ్డ ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌గా ఓడీ(ఆన్‌ డ్యూటీ) కింద పంపారు. ఈక్రమంలో ఆళ్లగడ్డ ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న నాగేంద్రప్రసాద్‌ను రుద్రవరం ఏఓగా ఓడీ(ఆన్‌ డ్యూటీ) కేటాయించారు. నాగేంద్రప్రసాద్‌కు ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌గా ఉండటానికి ప్రత్యేక శిక్షణ పొందిన అర్హతలు ఉండటంతోపాటు నిజాయతీ గల అధికారిగా పేరు. అలాంటి అధికారిని మాటమాత్రానికై నా సంప్రదించకుండా ఉన్నఫలంగా రుద్రవరం మండలానికి ఓడీ కింద పంపుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన మనస్తాపంతో వాటిని తీసుకోకుండానే సెలవు పెట్టి వెళ్లినట్లు సమాచారం. కాగా ఎలాంటి శిక్షణ పొందని శ్రీకృష్ణను ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌గా వేయడంతో రైతులకు కూడా పెద్దగా ప్రయోజనం ఉండదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఏఓపై క్షమశిక్షణ చర్యలకు

టీడీపీ నాయకుడి హుకుం

అధికారుల అత్యుత్సాహంతో

ఏఓకు మంచి ప్లేస్‌..

అక్కడ పని చేస్తున్న ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌కు

జిల్లా సరిహద్దులో ఆన్‌డ్యూటీ

మనస్తాపంతో సెలవుపై వెళ్లిన

ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement