● ఉదయం ప్రైమరీ, 6,8,10 తరగతులు
● మధ్యాహ్నం 7,9 తరగతులకు పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో నేటి (బుధవారం)నుంచి సమ్మేటివ్ అసెస్‌మెంట్–1 పరీక్షలు మొదలు కానున్నాయి. జిల్లాలో మొత్తం 1400 పాఠశాలలుండగా 1,52,169 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక తరగతులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 6,8,10 వ తరగతులకు 9.15 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 7,9 తరగతులకు చెందిన విద్యార్థులకు 1.15 నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రైవేటు స్కూళ్లకు మినహా మిగిలిన అన్ని యాజమాన్యాలకు చెందిన స్కూళ్లకు ఎంఆర్‌సీల నుంచి ప్రశ్నాపత్రాలు తరలించాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. నేటి నుంచి ఈనెల 19 వరకు ఎస్‌ఏ–1 పరీక్షలు జరుగుతాయి. సాధారణంగా గతంలో దసరా సెలవుల ముందుకానీ, ఆ తరువాత కానీ ఎస్‌ఏ–1 పరీక్షలు నిర్వహించే వారు. ఆరునెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాది సకాలంలో పుస్తకాలు అందించలేకపోవడం, టీచర్ల ట్రైనింగ్స్‌తో స్కూళ్లలో తరగతుల బోధన పూర్తి చేయకపోవడంతదితర కారణాలతో పరీక్షల నిర్వహణ ఆలస్యమైందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment