పెద్దాసుపత్రిలో వృద్ధునికి అరుదైన శస్త్రచికిత్స
కర్నూలు(హాస్పిటల్): మూత్ర సమస్యతో బాధపడుతూ యూరిన్ బ్యాగ్ చేతబట్టుకుని తిరుగుతూ నిత్యం నరకం అనుభవించే వృద్ధునికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల యురాలజీ విభాగం వైద్యులు ఆ బాధ నుంచి విముక్తి కలిగించారు. మంగళవారం యురాలజీ హెచ్‌ఓడీ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామయ్య వివరాలను వెల్లడించారు. ఆదోనికి చెందిన సుదర్శనరావు(74) ఆర్ అండ్ బీ కార్యాలయంలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చెందారు. ప్రస్తుతం ఆయన అనంతపురంలో కూతురి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు మూత్రాశయంలో సమస్య ఏర్పడింది. వైద్యులు అతనికి యూరినరీ బ్యాగ్‌ను అమర్చాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్లినా బ్యాగ్‌ను వెంట బెట్టుకుని వెళ్లాల్సి వచ్చేది. ఈనెల 21న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని యురాలజీ విభాగంలో చేరారు. అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించిన వైద్యులు ప్రోస్టోట్‌లో సమస్య ఉన్నట్లు గుర్తించి డిసెంబర్ 27న డాక్టర్ సీతారామయ్య ఆధ్వర్యంలో వైద్యుల బృందం శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయన కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జ్ చేశారు. కృతజ్ఞతగా డాక్టర్ సీతారామయ్యను సుదర్శన్‌రావు సన్మానించారు. ఆపరేషన్ చేసిన వారిలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ముత్యశ్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాల రవితేజ, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ మహేష్‌నాయక్, పీజీలు లయీఖ్ ఫాతిమా, హిమజ, ప్రశాంత్, ఉమామహేశ్వర్, రవీంద్రనాథ్, సాయిసుదీప్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment