విద్యుదాఘాతంతో రెండు ఆవుల మృతి
బనగానపల్లె రూరల్: మండలంలోని యనకండ్ల గ్రామంలో విద్యుదాఘాతంతో రెండు గోవులు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు వివరాలు.. గ్రామంలోని శ్రీకృష్ణ మందిరానికి చెందిన గోవులు గ్రామసమీపంలోని పెట్రోల్‌బంకు వద్ద మేత మేస్తుండగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తగిలి షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాయి. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఎలాంటి రక్షణ గోడ లేకపోవడంతోనే గోవులు మృతి చెందాయని శ్రీ కృష్ణమందిరం నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లాకిన్స్‌లా నుంచి 614 క్యూసెక్కుల నీటి విడుదల
పాములపా డు: కేసీ కెనాల్ 120వ కిలో మీటరు లాకిన్స్‌లా నుంచి 614 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ శ్రీనివాసనాయక్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సుంకేసుల నుంచి కేసీ కాల్వలోకి 800 క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. కాగా మండలంలోని శాంతి నిలయం గ్రామ సమీపంలోని లాకిన్స్‌లా నుంచి తూడిచెర్ల సబ్‌చానల్‌కు 570 క్యూసెక్కులు, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 34 క్యూసెక్కులు, నిప్పులవాగుకు 10 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment