ఘనంగా ఖాదర్‌లింగ స్వామి జన్మదిన వేడుకలు
కౌతాళం: మండల కేంద్రంంలో వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. తెల్లవారు జామున 5 గంటలకు ప్రత్యేక ఫాతెహాలు అనంతరం భక్తుల్ని దర్శనానికి వదిలారు. సాయంత్రం దర్గాలో ప్రత్యేక ఫాతెహాల అనంతరం స్వామి చిత్రపటానికి పూలమాల వేసి గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో జిల్లా నలుమూల నుంచే గాక మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకున్నారు. కాగా ఆచారం ప్రకారం స్వామి చిత్రపటాన్ని గ్రామానికి చెందిన లింగాయితీ వంశస్తులు తలపై మోసుకొని ఊరేగింపు నిర్వహించడం హిందూ, ముస్లిల ఐక్యతను చాటి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment