నంద్యాల: జనన, మరణ ధ్రువీకరణ పత్రాల ఆవశ్యకతను తెలియజేస్తూ వాటిని పొందే విధానంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మంగళవారం ఆమె తన చాంబర్‌లో జనన మరణ పత్రాల జారీపై అధికారులతో ఇంటర్ డిపార్టుమెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన తర్వాత 21 రోజుల వ్యవధిలోపు డెలివరీ అయిన ఆసుపత్రిలోనే మెడికల్ ఆఫీసర్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ పొందవచ్చునన్నారు. ఈ విషయం ప్రజలకు తెలిసేలా ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జనన, మరణ రికార్డులు సంబంధిత కార్యాలయాల్లో ఉండడంతో పాటు సచివాలయాల్లో కూడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైతే మరణిస్తారో ఆయా ప్రదేశం నుంచే మరణ ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుందని తెలిపారు. మరణాల నమోదు రిజిస్టర్ కూడా శ్మశానవాటికల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నంద్యాల ఆర్‌డీఓ విశ్వనాథ్, డీఎంహెఓ వెంకటరమణ, డీసీహెచ్‌ఎస్ జఫరూళ్ల, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ జిలానీ, మునిసిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డి, స్టాటిస్టికల్ అధికారి సుజాత పాల్గొన్నారు.
7వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
నంద్యాల(అర్బన్): ఎస్సీ కుల గణనపై అభ్యంతరాల (ఆడిట్) స్వీకరణ గడువును ఈనెల 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమం సాధికారత అధికారిణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది వరకు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఉండేదన్నారు. దీనిని మరో వారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment