వరిధాన్యం కొనుగోలుకు చర్యలు
● కర్నూలు మార్కెట్‌లో వరి ధాన్యం క్రయవిక్రయాలకు చర్యలు ●ఈ మేరకు మిల్లర్లతో సమావేశం ● త్వరలో కొనుగోళ్లపై నిర్ణయం ● మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం క్రయవిక్రయాలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. మంగళవారం మార్కెట్ యార్డులోని సెక్రటరీ చాంబరులో మిల్లర్లతో సమావేశమై మార్కెట్ యార్డులో ధాన్యం క్రయవిక్రయాలు నిర్వహించడంపై చర్చించారు. ధాన్యం కొనుగోలుకు ఉన్న అవకాశాలను, సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సానుకూలంగా స్పందించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి ధాన్యం ప్రధాన ఆహార పంట, అయితే మార్కెటింగ్ సదుపాయం లేదు. రైతులు దళారీలకు విక్రయించుకుంటూ నష్టపోతున్నారు. ఈ నేపఽథ్యంతో మార్కెట్‌లో ఈ–నామ్ ద్వారా రహస్య టెండరు విధానంలో వరి పంట కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. మిల్లర్లతో మరింత లోతుగా చర్చించి త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, శివన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment