చెంచుగూడేల్లో నన్నారి తోటల సాగు
ఆత్మకూరు: నల్లమల అటవీ డివిజన్ పరిధిలోని అన్ని చెంచుగూడేల్లో నన్నారి తోటల సాగును విస్తృ తం చేస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. బైర్లూటీ చెంచుగూడెంలోని నన్నారి నర్సరీ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించి మాట్లాడారు. ఇక్కడి కేంద్రంలో శిక్షణ పొందిన వారి ద్వారా ఇతర చెంచుగూడేల్లో నన్నారి తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ఈ తోటల పెంపకం ద్వారా ప్రతియేటా గిరిజనులకు మంచి ఆదాయం వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అన్ని గూడేల్లో నన్నారి నర్సరీ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి నాయక్, ఆర్వోఎఫ్‌ఆర్ ప్రాజెక్టు అసిస్టెంట్ రాఘవేంద్ర, వెలుగు సీసీ యూసూఫ్, అంకన్న, బైర్లూటీ సర్పంచ్ గురమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment