భూముల రీసర్వేతో ఇబ్బందుల తొలగింపునకు చర్యలు
నంద్యాల(అర్బన్): భూముల రీ సర్వేతో ఇబ్బందుల తొలగింపుకు చర్యలు చేపడుతున్నామని సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజు అన్నారు. రీసర్వే పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న మండలంలోని కానాల గ్రామంలో రీ సర్వేపై రైతుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు 20 సర్వే నంబర్లకు సంబంధించిన పొలాల రీ సర్వే సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఐఓఎస్ కృష్ణకుమార్, డీటీలు రామచంద్రరావు, నాగరాజు, సర్వేయర్ శివప్రసాద్, వీఆర్‌ఓ ప్రియాంక పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment