నెలనెలా జీతం చెల్లించాలి
కష్టానికి తగిన ప్రతిఫలం లేక పోయినప్పటికీ వచ్చే కొద్దిపాటి సొమ్మయినా నెలనెల చెల్లిస్తే బాగుంటుంది. గతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు జీతం ప్రతి మాసం సక్రమంగా చేతికి అందేది. ఇప్పుడు ఒకనెల సరిగ్గా వస్తే మరోనెల అందదు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల వారు ఆలోచించి ప్రతి నెల చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – మంత్రనాయక్, ప్రొటెక్షన్ వాచర్
ఈఎస్‌ఐ ఉన్నా ఉపయోగం లేదు
నేను సుమారు 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. అప్పటి నుంచి నా జీతంలో ఈఎస్‌ఐ కట్ అవుతూనే ఉంది. ఒక సారికూడా వైద్య సేవలకు ఉపయోగ పడలేదు. గతేడాది నా భార్య ప్రసవించిందని ఈఎస్‌ఐ కార్యాలయం దగ్గరకు పోతే ఆధార్, ఆసుపత్రి సర్టిఫికెట్లు తెచ్చి ఇస్తే రూ. 7,000 వస్తుందని చెప్పడంతో అన్ని ఇచ్చా. తర్వాత ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోలేదు. డబ్బు రాలేదు. – భాస్కర్, ప్రొటెక్షన్ వాచర్
చనిపోయినా రూపాయి రాలేదు
బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పటి నుంచి నా భర్త నాగులేటి ప్రొటెక్షన్ వాచర్‌గా ఆయన తోపాటు నేను రాత్రి పగలు అడవిలోనే ఉండేవాళ్లం. ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడే ఉండే వాళ్లం. అడవి ఈదర, దోమలతో పాలమాలిన నా భర్త సక్రమంగా నడవలేక పోతున్నాడని అధికారులు పని మాన్పించినారు. అడవి నుంచి ఊర్లోకి వచ్చి ఐదారు నెలలు ఆసుపత్రికి తిరిగినా కోలుకోలేక చనిపోయాడు. సుమారు నాలుగేళ్లు అయినా ప్రభుత్వం ఒక్క రూపాయి సాయం చేయలేదు. పీఎఫ్ డబ్బు కూడా రాలేదు. – హనుమక్క, అహోబిలం
వసతులు కల్పించేందుకు చర్యలు
బేస్ క్యాంపుల్లో పనిచేసే ప్రొటెక్షన్ వాచర్లకు అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. క్యాంపుల్లో సోలార్ లేట్లు, రాత్రి పూట అడవిలో తిరిగేందుకు చేతిలైట్లు, వాటర్ ఫిల్టర్లు, గదులు కూడా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉద్యోగ భద్రత, జీతాలు పెంచడం మా పరిధిలోకి రాదు. అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. – శ్రీపతినాయుడు,
అటవీ రేంజ్ అధికారి, రుద్రవరం
Comments
Please login to add a commentAdd a comment