9 రోజులు.. 68శాతం
జిల్లాలో వడివడిగా సమగ్ర కుటుంబ సర్వే
ఈ ఫొటోలో సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్ పేరు భారతి. సమగ్ర కుటుంబ సర్వేలో ఆమెకు మద్ధెలబీడు గ్రామంలో 150 కుటుంబాలను సర్వే చేసేందుకు కేటాయించారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించిన సర్వేలో 87 కుటుంబాల సర్వేను పూర్తి చేశారు. ఒక్క కుటుంబ సమాచారం సర్వే ఫామ్‌లో నమోదు చేసేందుకు 25 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. సర్వేలో స్వరాష్ట్రంలో వలసలకు ప్రత్యేక కాలం లేకపోవడం, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు స్థానికంగానే ఉంటున్నట్లు నమోదు చేయిస్తున్నారు. పలువురు లబ్ధిదారులు వివరాలను నమోదు చేయించిన తర్వాత మార్పులు చేర్పుల కోసం తిరిగి వారిని సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడిగానే ఉన్న కుటుంబాలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వివాహమైన వారు ఇంటికి అతికించిన ఎనుమరేషన్ బ్లాక్ ఇంటి సంఖ్యకు బై నెంబర్ల వేయించుకుని సర్వే వివరాలను నమోదు చేయిస్తున్నారని తెలిసింది.
●
వంద శాతం పూర్తి చేస్తాం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా కుటుంబ సమగ్ర సర్వేను కలెక్టర్ దిశానిర్ధేశంతో వంద శాతం పూర్తి చేస్తాం. ముందుగా ఈ నెల 22 వరకు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రారంభించాం. కాగా రెండు, మూడు రోజులు ఆటు ఇటుగా పూర్తి అవుతుంది.
– యోగానంద్, సీపీఓ, నారాయణపేట
ఎన్యుమరేటర్లకు
తప్పని తిప్పలు
ఇంటింటా సమగ్ర సర్వేకు వె వెళ్లే ఎన్యుమరేటర్లకు ఇబ్బందులు తప్పడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 9.30 గంటలు దాటితే ప్రజలు చాలామటుకు కూలి పనులకు, పొలం పనులకు వెళ్తున్నారు. ఉదయం 7.30 గంటల నుంచి 9 గంటల వరకు వెళ్తే తప్ప ఉండడం లేదు. సాయంత్రం వేళల్లో వెళ్దామంటే 6 గంటల తర్వాత వాళ్లు ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంటి దగ్గర ఉండే వృద్ధులను వివరాలను అడిగేందుకు ప్రయత్నిస్తున్నా వారితో సరైన సమాధానాలు రాకపోవడంతో ఏదో ఒకటి రాసుకొచ్చే పరిస్థితి ఉందని తెలుస్తోంది.
నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలో ఇప్పటివరకు 68శాతం పూర్తయ్యింది. ఈ నెల 9వ తేదీన ఈ సర్వే ప్రారంభం అయ్యింది. జిల్లాలో మొత్తం 1,55,999 కుటుంబాలు ఉండగా 1,06,326 కుటుంబాల వివరాలను ఇన్యుమరేటర్లు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1201 ఈ బ్లాకులకు గాను 1181 మంది ఎన్యుమరేటర్లు, 118 మంది సూపర్‌వైజర్లు విధుల్లోకి వెళ్లి తొలి రోజు 6,452 కుటుంబాలతో 75 ప్రశ్నలతో సమాచారాన్ని సేకరించగా.. 9 రోజులుగా చేపడుతున్న సర్వేతో 68 శాతానికి నమోదైంది. ఈ సర్వే పై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అడుగుతూ సర్వే రిపోర్టును ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటల వరకు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికను రాష్ట్ర ఉన్నాతాధికారులకు నివేదిస్తున్నారు. వంద శాతం సర్వే చేపట్టేందుకు ఇంకా 8 రోజుల సమయం ఉంది.
ఆదివారం 6 శాతమే నమోదు
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 9 నుంచి ఇంటింటా సర్వేను చేపట్టారు. తొలి రోజు 6,452 కుటుంబాలను సర్వే చేయడంతో 4.1 శాతం నమోదైంది. 10వ తేదీ నాటికి 17,436 కుటుంబాలు (11.2 శాతం), 11 నాటికి 29,842 (19.1 శాతం) కుటుంబాల సర్వే పూర్తయ్యింది. 12, 13వ తేదీల నాటికి 43,708 కుటుంబాల సర్వే చేయడంతో మొత్తంగా 28 శాతానికి చేరుకుంది. 14వ తేదీ వరకు 71,340 కుటుంబాలు, 15 వరకు 83,452, 16 వరకు 97,550, 17న 1,06,326 కుటుంబాల సర్వే పూర్తి కావడంతో మొత్తంగా 68.2 శాతానికి చేరుకుంది. అయితే ఆదివారం కేవలం 6 శాతం మాత్రమే సర్వే జరిగిందని చెప్పవచ్చు.
పలు ఆంశాలపై అనాసక్తి
భూమిలేని వారికి సంబంధించి పది ప్రశ్నలకు ప్రజలు ఎలాంటి సమాధానాలు చెప్పడంలేదు . రిజర్వేషన్లపై ప్రశ్నలకు చాలావరకు సమాధానం చెప్పడానికి అనాసక్తి చూపిస్తున్నారు. విద్య, ఉద్యోగ ప్రయోజనాలు, ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం నుంచి పొందిన పథకాల పేర్లు అన్న ప్రశ్నకు చాలామంది సామాన్యుల నుంచి సమాధానం రావడం లేదు. ఇల్లు, ఉపాధి, ఉద్యోగం, చేయడానికి కులవృత్తి ఎలాంటి అవకాశాలు లేని వారు ప్రభుత్వం నుండి పొందిన లబ్ధి, మహిళలకు ఆధార్ కార్డు ఉండి ఉచిత బస్సు ప్రయాణం పథకం పొందుతున్నారని దాన్నే ప్రభుత్వ లబ్ధిగా సర్వేలో రాసుకుంటున్నారు. రాజకీయ నేపథ్యమనేది ప్రజాప్రతినిధులకు సంబంధించినవి.. అది సామాన్యులకు సంబంధంలేని అంశంగా చాలామటుకు భావిస్తున్నారు.
జిల్లాలో మండలాల వారీగా సర్వే వివరాలిలా..
మున్సిపాలిటీల వారీగా...
గ్రామీణ ప్రాంతాల్లో వివరాల
సేకరణకు అవస్థలు
1,55,999 కుటుంబాలకు.. 1,06,326 కుటుంబాల
వివరాల సేకరణ
ప్రతిరోజు కలెక్టర్,
జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన
సామాన్యుడికి లాభమేంటి
ఈ ఫొటోలో కనిపిస్తున్నది నారాయణపేట పట్టణంలోని దూల్‌పేటకు చెందిన అనిల్. ఆదివారం ఇంటింటి సర్వేకు వచ్చిన అధికారి తో.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వల్ల సామాన్యుడికి ఎలాంటి ప్రయోజనం జరుగుతుందో చెప్పాలని కోరారు. సర్వేలో అడిగిన 56 ప్రశ్నలతో సామాన్యులకు ఎలాంటి లాభం జరుగుతుందో వివరించాలని వారిని ప్రశ్నించడం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment