ఆలస్యంగా వచ్చారు.. మిస్ అయ్యారు
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన గ్రూప్–3 పరీక్షకు పలువురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో కేంద్రంలోకి అనుమతి లభించలేదు. కలెక్టర్ తనిఖీకి వచ్చిన సమయంలోను ఆమెను సంప్రదించగా నిబంధనల ప్రకారం జరుగుతాయని చెప్పి లోపలికి వెళ్లిపోయారు. మొత్తంగా 16మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు.
● ధన్వాడకు చెందిన సుజాత నెలన్నర కూతురితో కృష్ణగోకులం పాఠశాలలోని పరీక్ష రాసేందుకు రాగా సమయం అయిపోయిందని సిబ్బంది లోపలికి అనుమతించలేదు. కనీసం మధ్యాహ్నం పరీక్ష కోసం వేచి చూడటానికి కేంద్రం పరిసరాల్లో కూర్చుంటుండగా పోలీసులు అనుమతించలేదు. దగ్గరలోని అంబేద్కర్ సర్కిల్ బస్ షెల్టర్‌లో గంటల తరబడి కూర్చోవాల్సి వచ్చింది. మధ్యాహ్నం 4వ తరగతి చదువుతున్న తన అక్క కూతురు హాన్సికకు తన నెలన్నర కూతురుని ఇచ్చి పరీక్షకు వెళ్లింది.
● శిశుమందిర్ స్కూల్ వద్ద నలుగురు అభ్యర్థులు సెంటర్ చిరునామా ఆలస్యం కావడంతో పరీక్షకు హాజరుకాలేకపోయారు.
● మక్తల్‌కు చెందిన భార్యభర్తలు దీపిక, విజయ్ ఇరువురిలో సీఎన్‌ఆర్ డీసీలో భార్యకు, ప్రభుత్వ బాలికల స్కూల్‌లో భర్తకు కేంద్రాలు అలాట్ అయ్యాయి. బైక్‌పై ముందుగా భార్యను వదిలి తన సెంటర్‌కు భర్త వెళ్లాడు. అయితే సమయం అయిపోయిందని దీపికను అనుమతించకపోగా ఈమె తర్వాత వెళ్లిన విజయ్‌కు మాత్రం పరీక్ష రాసే అవకాశం దొరికింది. నిర్వాహకులు ఒక్కో సెంటర్‌లో ఒక్కోతీరుగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment