యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
నారాయణపేట ఎడ్యుకేషన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని హార్ట్‌ఫుల్‌నేస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఆంజనేయులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ సుదర్శన్ సమక్షంలో యోగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో యోగా, ధ్యానం చేయడం ద్వారా శారీరక దృడత్వం, మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెంపొందించుకోవచ్చచి అన్నారు. తమ స్వచ్ఛంద సంస్థ ఇంటర్‌బోర్డు సహకారంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వెంకట్రాములు, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment