నారాయణపేట రూరల్: చదువుకునే వయసులో ఆర్థిక స్థోమత, కుటుంబ పరిస్థితుల కారణంగా పలువురు చిన్నారులు బడికి వెళ్లడం లేదు. కొందరు ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంటే.. మరికొందరు కులవృత్తుల్లో కొనసాగుతున్నారు. ఇవేవీ లేని వారు హోటళ్లు, బేకరీలు, దుకాణాల్లో బాలకార్మికులుగా పనిచేస్తూ చదువుకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టే చర్యలు కొంతమేర సత్ఫలితాలను ఇస్తున్నాయి. అందులో భాగంగా బడిఈడు పిల్లలను గుర్తించి, పాఠశాలల్లో చేర్పించేందుకు గాను ప్రత్యేకంగా సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది.
● బడిఈడు పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా పాఠశాలలకు వెళ్లని బడిఈడు పిల్లల గుర్తింపునకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలబాలికల విద్యకు ప్రాధాన్యమిస్తున్నప్పటికీ.. చాలా మంది చిన్నారులు బడికి దూరంగానే ఉంటున్నారు. ఎన్ని సర్వేలు చేపట్టినా ఏటా పిల్లలను గుర్తించడంతోనే సరిపోతుంది. అధికారులు తల్లిదండ్రులకు ఎన్నిసార్లు విన్నవించినా పిల్లల బాల్యం మాత్రం బడిబయటే మగ్గుతుంది. కొంతమంది బడికి వచ్చినా కుటుంబ పరిస్థితుల కారణంగా మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. వీరిని గుర్తించేందుకు గురువారం నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నారు.
నేటి నుంచి బడిబయటి పిల్లల గణన
నెల రోజులపాటు కొనసాగనున్నఓఎస్‌సీ సర్వే
బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యం
సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మెతోతప్పని తిప్పలు
Comments
Please login to add a commentAdd a comment