సులభ పద్ధతిలో గణిత బోధన
నారాయణపేట రూరల్: గణితంపై విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ఉపాధ్యాయులు సులభ పద్ధతిలో బోధన చేయాలని డీఈఓ గోవిందరాజులు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గ్రౌండ్ ఉన్నత పాఠశాలలో బుధవారం గణితఫోరం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గణిత ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పోటీ పరీక్షల్లో గణితం ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించాలని తెలిపారు. పాఠశాల స్థాయిలోనే గణితంపై పట్టు సాధించేలా తీర్చిదిద్దాలని కోరారు. కాగా, గణిత పరీక్షకు మండలస్థాయిలో ప్రతిభ కనబరిచిన 84 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు.
విజేతలు వీరే..
తెలుగు మీడియం విభాగంలో శిరీష (మొగల్ మడ్క), అరవింద్ (భూనేడ్), నవిత (ఊట్కూర్), ఇంగ్లిష్ మీడియం విభాగంలో లక్ష్మీ మనోజ్ఞ (నారా యణపేట), శశాంక (మద్దూరు), నిహారిక (కోస్గి), రెసిడెన్షియల్ విభాగంలో శ్రీవేణి (మరికల్), హేమలత (కోటకొండ), శ్రీవాణి (మరికల్) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. కార్యక్రమంలో ఏఎంఓ విద్యాసాగర్, ఎంఈఓ బాలాజీ, గణిత ఫోరం అధ్యక్షుడు సురేష్, కార్యదర్శి రామకృష్ణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment