మక్తల్ మార్కెట్ పాలకవర్గం నియామకం
మక్తల్: మక్తల్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ చైర్‌పర్సన్‌గా మక్తల్ మండలం సంగంబండకు చెందిన గవినోళ్ల రాధమ్మ, వైస్‌చైర్మన్‌గా మక్తల్‌కు చెందిన గణేష్ కుమార్, డైరెక్టర్లుగా మహేంద్ర, రంజిత్‌కుమార్‌రెడ్డి, సాలాబిన్ ఉమర్, పి.నాగప్ప, విష్ణువర్ధన్‌రెడ్డి, ఫయాజ్, మహేష్, శంకర్ లింగం, ఆంజనేయులు, జనార్దన్ గుప్తా, నాగప్పలను నియమించారు. మార్కెట్ పాలకవర్గం దాదాపుగా మూడేళ్లుగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ కోసం పనిచేసిన పదవులను కట్టబెట్టారని తెలుస్తోంది. నూతన పాలకవర్గం త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 13 నుంచి మక్తల్‌లో పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. 15వ తేదీన ఆంజనేయస్వామికి నిర్వహించే రథోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హాజరవుతారని.. అదే రోజు మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలిసింది.
చైర్‌పర్సన్‌గా గవినోళ్ల రాధమ్మ,వైస్‌చైర్మన్‌గా గణేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment