ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ బేన్ షాలం ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఫిర్యాదులను నేరుగా ఆయన స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పరిష్కరించాలని పేర్కొన్నారు. మొత్తం 27 ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామచందర్, ఏవో జయసుధ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment