ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలి
నారాయణపేట రూరల్: ప్రయాణికులు లేకుంటే సంస్థ మనుగడ అసాధ్యమని.. వారితో మర్యాదగా వ్యవహరించాలని ఆర్టీసీ మహబూబ్‌నగర్ రీజనల్ మేనేజర్ సంతోష్‌కుమార్ అన్నారు. ఇటీవల పదోన్నతి పొంది మంగళవారం తొలిసారి నారాయణపేట డిపోను సందర్శించారు. అన్ని విభాగాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ప్రగతిచక్రం అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదన్నారు. కార్మికులపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు ఉండవని, విధి నిర్వహణలో భాగంగా తప్పులు జరిగితే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాటలోకి వచ్చిందని, అదేవిధంగా రోజు వారి ఖర్చుల కోసం టికెట్‌కొనే ప్రయాణికులు ఎంతో ముఖ్యమని చెప్పుకొచ్చారు. సంస్థ అభివృద్ధికి టార్గెట్‌లు సాధించడంతో పాటు ఖర్చులను తగ్గించడం ప్రతి ఒక్కరి బాఽధ్యతని తెలిపారు. అనంతరం గత నెలలో అత్యధిక ఈపీకే, మంచి కేఎంపీఎల్ ద్వారా సంస్థ ఆదాయం పెంచడం, ఖర్చులు తగ్గించడంలో విశేషంగా కృషి చేసిన కార్మికులకు ప్రశంసాపత్రాలు అందించారు. కార్యక్రమంలో డీఎం లావణ్య, సీఐ అలివేలమ్మ, ఎంఎఫ్ చందునాయక్, నరేందర్, వహీద్, రవికుమార్, ఆంజనేయులు పాల్గొన్నారు.
కోస్గి: స్థానిక ఆర్టీసీ బస్ డిపోను ఆర్‌ఎం సంతోష్ కుమార్ సందర్శించారు. డిపోలో అత్యుత్తమ కేఎంపీఎల్ సాధించిన డ్రైవర్లతోపాటు పనిలో ప్రతిభ చూపిన డిపో సిబ్బందిని సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment