పత్తి జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో అధికారులు పత్తి నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతోంది. అంతేకాకుండా శని, ఆదివారాల్లో సీసీఐ కేంద్రాలకు సెలవు ఉండడంతో మిగతా రోజుల్లో జిన్నింగ్ మిల్లుల వద్ద వాహనాలు బారులుదీరుతున్నాయి. తేమ 12 శాతం లోపే ఉండాలని.. వ్యర్థాలు ఉండొద్దనే కొర్రీలతో పత్తిని అసలు పరీక్షించకుండానే తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వడ్వాట్ శివారులోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లు వద్ద రైతులు మంగళవారం నిరసన తెలపడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment