రెండు విభాగాల్లో బడిబయటి పిల్లలను గుర్తించనున్నారు. 6నుంచి 14ఏళ్ల వరకు పాఠశాలస్థాయి కావడంతో ఒక విభాగం, 15నుంచి 19ఏళ్ల వారు కళాశాలస్థాయి కావడంతో మరో విభాగంగా గుర్తించి వేర్వేరుగా జాబితాను రూపొందిస్తారు. విద్యార్థి సామర్థ్యం, వయసు, అర్హత, ఆసక్తి మేరకు తగిన తరగతిలో చేర్పించడం.. లేదా దూర విద్యలో ప్రవేశాలు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
● విద్యాశాఖ పరిధిలోని సమగ్రశిక్ష కింద పనిచేసే సీఆర్పీలు, ఐఈఆర్‌పీలు, డీఎల్‌ఎంటీలు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు. చదువు ఎందుకు నిలిపివేశారనే అంశాలతో పాటు వారి కుటుంబ పరిస్థితులపై సమాచారం సేకరించి నమోదు చేసుకుంటారు. నెల రోజులపాటు సర్వే కొనసాగుతుంది. అనంతరం సర్వే వివరాలను డీఈఓ కార్యాలయంలో అందించడంతో పాటు ప్రబంద్ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు.
సర్వేపై సమ్మె ప్రభావం..
ఓవైపు బడిబయటి పిల్లల గుర్తింపు సర్వే చేయాలని విద్యాశాఖ ఆదేశించగా.. మరోవైపు సమగ్రశిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు సమ్మె నోటీసు అందించారు. ఇతర జిల్లాల్లో వారం రోజులుగా ఆందోళన చేపడుతుండగా.. నారాయణపేటలో మాత్రం గురువారం నుంచి సమ్మెబాట పడుతున్నారు. ప్రధానంగా సర్వే చేయాల్సిన సీఆర్‌పీలు, ఐఆర్‌పీలు సహాయ నిరాకరణ చేస్తుండటంతో ఓఎస్‌సీ సర్వేపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో సర్వే విజయవంతంగా నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment