కళాశాలల నిర్మాణానికి స్థలం అప్పగింత
కోస్గి రూరల్: ప్రభుత్వ ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కళాశాలల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేసి సంబంధిత అధికారులకు గురువారం అప్పగించామని తహసీల్దార్ బక్క నర్సింలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలను అప్‌గ్రేడ్ చేస్తూ కోస్గి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలగా ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ నేపథ్యంలో కళాశాల నిర్మాణానికి సర్వే నంబరు 1737లో 10 ఎకరాల 8 గుంటలను ప్రిన్సిపల్ శ్రీనివాస్‌కు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు సర్వే నంబరు 1809,1811,1812 లో 5 ఎకరాలను భూమిని ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డికి ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు కార్యక్రమంలో అర్‌ఐ సుభాష్‌రెడ్డి ,సర్వేయర్ అరుణ సిబ్బంది ఉన్నారు.
పేటను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుదాం
నారాయణపేట రూరల్: పేటను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని డీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కుంభం శివకుమార్ రెడ్డి అన్నారు. సీఎం కప్‌లో భాగంగా జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో గురువారం నాలుగో రోజు స్థానిక మినీ స్టేడియంలో ఖోఖో పోటీల ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు నిరంతరం సాధన చేయాలని, స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి జాతీయస్థాయిలో స్కేటింగ్ ఆడారని, రాష్ట్ర స్థాయిలో బాస్కెట్ బాట్‌లో ప్రతిభ కనబరిచారని కొనియాడారు. రాష్ట్రాన్ని ఒలంపిక్ హబ్‌గా మార్చాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి ధ్యేయమన్నారు. అందుకే ఇటీవల స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పడానికి కృషి చేశారన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో క్రీడా పోటీలను నిర్వహించాలన్నారు.
విజేతలు వీరే..
బాలికల విభాగంలో మొదటి బహుమతి మక్తల్ మండలం, రెండవ బహుమతి కృష్ణ మండలం, బాలుర విభాగంలో మొదటి బహు మతి నారాయణపేట మండలం, ద్వితీయ బహుమతి మద్దూరు మండల్ కై వసం చేసుకున్నాయి. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్, యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కోట్ల రవీందర్ రెడ్డి, గందే చంద్రకాంత్, మాధవరెడ్డి, ఎస్ జి ఎఫ్ కార్యదర్శి నరసింహులు, పిఈటీలు వెంకటప్ప, పారిజాత, కృష్ణవేణి, స్వప్న, రూప, మీనా కుమారి పాల్గొన్నారు.
తెల్ల కందులు
క్వింటా రూ.9,100
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో తెల్ల కందులు క్వింటా గరిష్టంగా రూ.9,100, కనిష్టంగా రూ.8,200 ధర పలికింది. ఎర్ర కందులు గరిష్టంగా రూ.8,640, కనిష్టంగా రూ.7వేలు, వడ్లు సోన గరిష్టంగా రూ. 2,634, కనిష్టంగా రూ.1,900, వడ్లు హంస గరిష్టంగా రూ.1,740, కనిష్టంగా రూ.1,700 ధర పలికాయి.
నవాబుపేట మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం
నవాబుపేట/దేవరకద్ర: నవాబుపేట మార్కెట్‌కు వరి ధాన్యం పోటెత్తింది.28,340 బస్తాల ధాన్యం విక్రయానికి వచ్చింది. సోనా మసూరి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,692 కనిష్టంగా రూ.2,020 పలికింది. దేవరకద్రలో ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,550, కనిష్టంగా రూ.2,509, కందులు గరిష్టంగా రూ.8,059, కనిష్టంగా రూ.7,709గా ధరలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment