వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి
నర్వ: వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం మండలంలోని రాయికోడ్ గ్రామంలోని పల్లె దవాఖానాను ఆమె తనిఖీ చేశారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్, ఏఎన్‌సీ నమోదు రిజిస్టర్‌ల అసంపూర్తిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 26న, కేంద్రమంత్రి బండి సంజయ్ నర్వ మండలానికి రానున్న నేపథ్యంలో ఆమె పర్యటించారు. నీతి అయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమానికి నర్వ మండలం ఎంపికై నందున మండలంలో చేపట్టిన పనులపై కేంద్ర మంత్రి పరిశీలించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. పల్లె దవాఖానాను పరిశీలించగా.. సిబ్బంది ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలు లేకపోవడంతో ఎందుకు రాలేదని డీఎంహెచ్‌ఓను అడిగారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి గర్భిణులకు పోషకాహారాన్ని అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. మండల పరిషత్ పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరిపడా వంటలు వడ్డించకపోవడంతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం అందించాలని ఆదేశించారు. ఇదిలాఉండగా,గ్రామంలోని ఎస్సీ కాలనికి తాగునీటి పైప్‌లైన్, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కాలనీ వాసులు కలెక్టర్‌కు మొర పెట్టుకున్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ మొగులయ్య, తహసీల్ధార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనువాసులు, ఏఓ అఖిలారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పల్లె దవాఖానాలో ఏఎన్‌సీ, ఎన్‌సీడీ స్క్రీనింగ్ రిపోర్టుల అసంపూర్తిపై కలెక్టర్ అసహనం
Comments
Please login to add a commentAdd a comment