ఆంగ్లంపై పట్టు సాధిస్తే ఉద్యోగావకాశాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: యువత ఆంగ్లంపై పట్టు సాధిస్తే సులువుగా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉందని పాలమూరు యూనివర్సిటీ వీసీ జీఎస్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ‘హైబ్రిడిటీ అండ్ బిలాంగింగ్ ఇంగ్లిష్ ఇన్ ఏ ట్రాన్స్‌లేషన్ వరల్డ్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్లోబలైజేషన్ నేపథ్యంలో అన్ని విద్యా, ఉపాధి, వాణిజ్యం వంటి అంశాలు ఆంగ్ల భాషతో ముడిపడి ఉన్నాయని, అందుకు విద్యార్థులు దానిపై దృష్టి సారించాలన్నారు. గ్రామీణస్థాయి విద్యార్థులకు ఆంగ్లం అంటే వెనుకబాటుతనం ఉండకుండా నిరంతర సాధన వల్ల దానిపై పట్టు సాధించేందుకు అవకాశం ఉందన్నారు. సెమినార్లతో విద్యార్థులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని భవిష్యత్‌లో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ కళాశాలల నుంచి మొత్తం 132 పరిశోధన పత్రాలను సమర్పించారు. కార్యక్రమంలో కీనోట్ స్పీకర్ జేఎన్‌టీయూ పులివెందుల ప్రొఫెసర్ సాంబయ్య, తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రఘుపతి, ప్రిన్సిపాల్ పద్మావతి, హెచ్‌ఓడీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎంవీఎస్ కళాశాలలో జాతీయ సెమినార్‌లో పీయూ వీసీ జీఎస్ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment