ముగిసిన సీఎం కప్ క్రీడా పోటీలు
నారాయణపేట రూరల్: జిల్లా స్థాయిలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. స్థానిక మినీ స్టేడియం గ్రౌండ్‌లో సాయంత్రం ఏర్పాటుచేసిన ముగింపు వేడుకలలో జిల్లా యువజన క్రీడా అధికారి వెంకటేష్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు దత్తురావు పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి సంవత్సరం క్రీడలు నిర్వహించడం వల్ల విద్యార్థులు చురుకుగా ఉంటారని, చక్కటి ప్రణాళికతో భవిష్యత్ గురుంచి ఆలోచిస్తారని చెప్పారు. ఆటలు ఆడటం వల్ల శారీరిక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. జిల్లాస్థాయిలో విజేతలు గాని ఇచ్చిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి మంచి పేరు తీసుకురావాలన్నారు.
ఘనంగా అథ్లెటిక్స్ పోటీలు
సీఎం కప్ పోటీల్లో చివరిరోజు అథ్లెటిక్‌కు సంబంధించిన ఆటలు ఆడించారు. అన్ని రకాల వయస్సుల వారికి బాల బాలికలకు వేరువేరుగా క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొని విజయం సాధించిన వారికి మెడల్‌బహుకరించారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ నర్సిములు, పీడీలు రమణ, సాయినాథ్, అనంతసేన, బాలరాజ్, ఆంజనేయులు, శ్రీధర్, శేఖర్, రాజశేఖర్, పారిజాత, అక్తర్ పాషా, పర్వీన్ పీఈటీలు కృష్ణవేణి, స్వప్న, రాజేష్, మంజుల, సవిత, ఖేలో ఇండియా కోచ్ హారిక పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment