దిగువకు ధరలు.. రైతు దిగాలు | - | Sakshi
Sakshi News home page

దిగువకు ధరలు.. రైతు దిగాలు

Published Mon, Dec 23 2024 12:40 AM | Last Updated on Mon, Dec 23 2024 12:40 AM

దిగువ

దిగువకు ధరలు.. రైతు దిగాలు

నారాయణపేట: ఆరుగాలం కష్టించి జనానికి ఆహారాన్ని అందించే రైతన్నను కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇటీవల కంది, పత్తి, వరి ధరలు బయటి మార్కెట్‌లో పతనమవుతుండడంతో ఎంతో ఆశగా పంటలు సాగు చేసిన రైతులు దిగాలు చెందుతున్నారు. ఈ ఏడాది వానాకాలంలో పత్తి 1,65,150 ఎకరాల్లో, కంది 60,800 ఎకరాల్లో, వరి 1,65, 092 ఎకరాలోల పంటలను సాగు చేశారు. జిల్లాలో గతేడాది కంటే ఈ ఏడాది కంది పంట దాదాపు 10 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగింది. గత పది రోజుల కింద ఉన్న కంది, వరి ధాన్యం ఉత్పత్తులపై మార్కెట్‌లో ఉన్న ధరలు రోజు రోజుకుపతనం అవుతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

తగ్గిన పత్తి దిగుబడులు.. ధరలు

ఎకరాకు 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 6 క్వింటాళ్లకు పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా 1,65,150 ఎకరాల్లో పత్తి సాగుచేయగా క్వింటాకు మొదట్లో ప్రైవేట్‌లో రూ.7,450 వరకు ధరలు పలికాయి. ఆ తర్వాత రోజు రోజుకు పడిపోతూ క్వింటాకు రూ.6,900 వరకు చేరింది. దీంతో రైతులు ప్రైవేట్‌కు విక్రయించకుండా ప్రభుత్వ సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. క్వింటాకు రూ.7,521 మద్దత ధర ఉండగా.. పత్తి నాణ్యతగా లేదంటూ ధరలు తగ్గిస్తుండడంతో రైతులు అయోమయంలో పడ్డారు.

నేల చూపులు చూస్తున్న కంది ధర

రాష్ట్రంలోనే నారాయణపేట జిల్లాలో పండించే కంది పంటకు మార్కెట్‌లో భలే డిమాండ్‌ ఉంటుంది. తెల్ల కందులు ఈ ప్రాంతంలో రైతులు అధికంగా పండిస్తుంటారు. ఈ నెల 12న క్వింటాకు గరిష్టంగా రూ.11,640 పలకగా.. 21వ తేదీ నాటికి క్వింటాకు రూ.8,629 పలకడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఎర్ర కందులు సైతం క్వింటాకు గరిష్టంగా రూ.11,625 ఉండగా.. ప్రస్తుతం రూ.8,329 పలకడం గమనార్హం.

మార్కెట్‌లో కంది, పత్తి, వరి ధాన్యం ధరలు పతనం

వారం రోజుల్లో కంది రూ.2వేలు తగ్గుదల

వరి, పత్తి రూ.500 మేర పడిపోయిన వైనం

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు

వరి ధరలు అంతంతే..

వడ్లు సోనా, హంస ధరలు గత నెలలో గరిష్టంగా రూ.3 వేలకు పైగా ఉండగా ఈ వారం రోజుల్లో పతనమయ్యాయి. ఈ నెల 12న వడ్డు సోనా రూ.2,696 ఉండగా 21వ తేదీ నాటికి రూ.2,603 పలికాయి. వడ్లు హంసకు గరిష్టంగా 2,650 ఉండగా రూ. 1700 పడిపోయాయి. ఇటు ప్రైవేట్‌లో ధరల పతనం...ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో నిబంధనల కోర్రీలతో రైతులకు ధాన్యం విక్రయాల్లో కష్టాలు తప్పడం లేదని చెప్పవచ్చు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నాలకు మాత్రమే రూ. 500 క్వింటాకు బోనస్‌ ఇస్తుండడం.. దొడ్డు రకం వడ్లకు ఇవ్వకపోవడంతో రైతులు నష్టపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దిగువకు ధరలు.. రైతు దిగాలు 1
1/2

దిగువకు ధరలు.. రైతు దిగాలు

దిగువకు ధరలు.. రైతు దిగాలు 2
2/2

దిగువకు ధరలు.. రైతు దిగాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement