సిబ్బంది కొరతతో ఇక్కట్లు
ఉమ్మడి జిల్లాలో ఆహార భద్రత శాఖలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు లేకపోవడంతో హోటళ్లపై పర్యవేక్షణ లేకుండాపోయింది. ఉమ్మడి పాలమూరులోని వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మొదటి నుంచి ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉండగా.. జోగుళాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్‌లకు ఈ నెల 2న కొత్తగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను కేటాయించారు. ప్రస్తుతం వీరు 45 రోజులపాటు శిక్షణ పొందుతున్నారు. అలాగే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్లను కేటాయించారు. ఇప్పటి వరకు సరైన సిబ్బంది లేకపోవడంతో తనిఖీలు చేయని అధికారులు.. ఇకనైనా రెగ్యులర్‌గా తనిఖీలు చేస్తారా.. లేదా.. అనేది వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment