వారం రోజుల్లో మరింత తగ్గుదల
మహరాష్ట్రలోని సోలాపూర్ మార్కెట్‌లో ఈ నెల 13న ఒక్కసారిగా క్వింటాకు రూ.1500 పడిపోయింది. రోజు రోజుకు ధరలు పడిపోతున్నాయి. రైతులు సహకరించి ఎప్పటికప్పుడు కందులను విక్రయించుకోవడం మంచిది. ప్రభుత్వ మద్దతు ధరకంటే అధికంగానే మార్కెట్‌లో ధరలు పలుకుతున్నాయి. తెల్లకందులు నాణ్యమైన వాటిని కోనుగోలు చేస్తున్నాం. పచ్చ, కసరా, పగిలిన పప్పులతో ఉన్నేవాటిని తిరస్కరిస్తున్నాం. – సంపత్‌కుమార్ ధారక్,
వ్యాపారి, నారాయణపేట
రైతుల పక్షానే ఉంటాం
రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంది. నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌యార్డుకు రైతులు తీసుకువస్తున్న కంది, వరి ధాన్యానికి గిట్టు బాటు ధరలు లభిస్తున్నాయి. కంది మద్దతు ధర రూ. 7,550 ఉంటే మార్కెట్‌లో రూ. 8 వేల కంటే ఎక్కువగా పలుకుతున్నాయి. రైతులు సహకరిస్తూ మార్కెట్ అభివృద్దికి తోడ్పాటునందించాలని కోరుతున్నాం.
– ఆర్.శివారెడ్డి, మార్కెట్ చైర్మన్, నారాయణపేట.
ప్రైవేట్‌లో ధరలు లేక సీసీఐకి
పత్తికి ప్రైవేట్‌లో ధరలు పెరుగుతాయని 20 రోజుల నుంచి ఎదురుచూశా. ధరలు లేకపోవడంతో సిపిఐ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి అమ్మా. 20 క్వింటాళ్లు అయ్యింది. ఏటేటా పత్తిధరలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో సైతం రూ. 7420లకు అమ్మాల్సి వచ్చింది.
– సంజన్న, పత్తి రైతు
●
Comments
Please login to add a commentAdd a comment