‘కడపరాయ’ హుండీ ఆదాయం లెక్కింపు
ధన్వాడ: మండలంలోని గున్ముక్ల కడపరాయస్వామి హుండీ ఆదాయం రూ.1,41,200 వచ్చిందని కమిటీ సభ్యులు తెలిపారు. వారం రోజుల జాతర ముగియడంతో ఆదివారం కమిటీ సభ్యుల అధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు.
ఉద్యోగుల సమస్యలుపరిష్కరించాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని మున్సిపాల్ పార్క్ దగ్గర గత 11 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. ఆదివారం జాతీయ గణిత దినోత్సవం సంద ర్భంగా శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెఏసీ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అల్తాప్ హుస్సేన్ మాట్లాడుతూ గత కొన్ని రోజులు సమ్మె చేస్తున్న కారణంగా కేజీబీవీ పాఠశాలలో చదివే పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని, దాదాపు అందులో చదివే వారందరూ బడుగు బలహీన వర్గాల, అనాథ పిల్లలేనని, వారు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించి పే స్కేల్ పెంచి క్రమబద్దీకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏస్‌ఓలు విజయ, గౌరమ్మ, షాలిని, సీఆర్‌టీలు మహేశ్వరి, శివకుమార్, మహేష్, పీటీఐలు రమేష్, సునీత, స్నేహలత తదితరులు పాల్గోన్నారు.
యాదవులు అన్నిరంగాల్లో రాణించాలి
నారాయణపేట: రాష్ట్రంలోని యాదవులంతా సంఘటితమై.. అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని.. యాదవ యువత రాజకీయాల్లోకి ముందుకు రావాలని అఖిల భారత జాతీయ ఉపాధ్యక్షుడు రమేశ్‌బాబు యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేటలో ఏర్పాటు చేసిన అఖిల భారత యాదవ మహాసభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇటీవల నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే సదర్ ఉత్సవాల్లో జిల్లాలోని యాదవులంతా ఏకతాటిపైకి వచ్చి విజయవంతం చేశారన్నారు. ఇదే ఐకమత్యంతో ముందుకు సాగుతూ రాబోయే స్థానిక సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయాల్లో రాణించాలని యువతకు పిలుపునిచ్చారు. గెలుపోటములు సహజమని..పోటీ చేయడంతో అందరిలోనూ ఐక్యత కలుగుతుందన్నారు. అనంతరం తిరుపతి, వెంకట నరసయ్య, రఘువీర్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా బాలప్ప, ప్రధాన కార్యదర్శిగా చెన్నప్ప యాదవ్, ఉపాధ్యక్షులుగా శశికాంత్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్, నగేష్ యాదవ్ , రఘు యాదవ్ , కోశాధికారిగా గోపాల్ యాదవ్ తదితరులను ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment