రైతు దంపతులకు పుడమిపుత్ర అవార్డు
మరికల్: యాదగిరిగుట్టలో నిర్వహించిన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ కార్యక్రమంలో మరికల్‌కు చెందిన దండు నారాయణరెడ్డి, లక్ష్మి దంపతులకు ఆదివారం పుడమిపుత్ర అవార్డు వరించింది. సేంద్రియ వ్యవసాయం ద్వారా భూసారాన్ని పెంచడమే కాకుండా పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుట కోసం ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న 10 రాష్ట్రాలలోని 115 మంది ఉత్తమ రైతు దంపతులను ఎంపిక చేశారు. అందులో ప్రకృతి వ్యవసాయం చేస్తు పలువురికి ఆదర్శంగా నిలిచిన దండు నారాయణరెడ్డి, లక్ష్మి దంపతులకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ కింద పుడమిపుత్ర అవార్డును నిర్వాహుకుల చేతుల మీదుగా అందుకోవడంతో మరికల్ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment