సేవా దృక్పథంతో న్యాయసేవలు అందించాలి
నారాయణపేట: క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురైనా చిత్తశుద్ధి, సేవా దృక్పథంతో న్యాయ సేవలు అందించేందుకు తమ వంతు బాధ్యతగా పనిచేయాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ సూచించారు. బాలల హక్కులు, చట్టాల అమలు, రక్షణ, సంరక్షణ వంటి అంశాలపై చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ సభ్యులకు జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కమిటీ సభ్యులకు బాల్యవివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాలు వంటి అంశాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. స్నేహపూర్వకమైన బాలల న్యాయ సేవల పథకం–2024 ప్రకారం బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలో ఏర్పాటైన చైల్డ్ ఫ్రెండ్లీ స్కీం న్యాయ సేవలు విభాగం బాధ్యతలను, 2025 సంవత్సరమంతా చేపట్టాల్సిన కార్యక్రమాల పట్టికను ఆ విభాగం ద్వారా ప్యానెల్ లాయర్స్, పారా లీగల్ వలంటీర్స్‌కి ఎలాంటి పనులు చేయాలి, గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి, ఎవరెవరితో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి, వివిధ సంస్థలతో సహకారం తీసుకొనిన్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించాలని ఆదేశించారు. అదే విధంగా కమ్యూనిటీ మొబైలిజషన్ ఆఫీసర్ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు, విధులు, వివిధ భాగస్వామ్య పక్షాల బాధ్యతలు విధులు కమిటీ మెంబర్స్‌కి తెలియజేశారు. కార్యక్రమంలో డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ తిరుపతయ్య, డిఫెన్స్ కౌన్సిల్స్ కే లక్ష్మీపతి గౌడ్ , నాగేశ్వరి, కమిటీ మెంబర్స్ రఘువీర్ యాదవ్, పి ఎల్ విస్, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.
మార్కెట్‌యార్డు
అభివృద్ధికి కృషి
మక్తల్: మార్కెట్‌యార్డు అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని, ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు, రైతులు విశ్రాంతి తీసుకునేందుకు గదులు నిర్మించేందుకు నిధులు మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మక్తల్ మార్కెట్ కార్యాలయంలో నూతన కమిటీ చైర్‌పర్సన్ గవినోళ్ల రాధమ్మ, వైస్‌చైర్మన్ గణేష్‌కుమార్, డైరెకర్లను ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. చైర్‌పర్సన్ రాధమ్మ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, అందరి సహకారంతో మార్కెట్‌యార్డును అభివృద్ధి బాటలో నడిపిస్తానని, రాష్ట్రంలోనే మిగతా యార్డులకంటే అభివృద్ధిలో ముందంజలో ఉంచుతానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment