నారాయణపేట: శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా జనవరి 31 వరకు ‘30 పోలీస్ యాక్ట్‘ అమల్లో ఉంటుందని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదిఇవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, ఫంక్షన్ హాల్లో కార్యక్రమాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమ్మిగుడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు. అనుమతులు లేకుండా పై కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారి తీసే సమావేశాలు, జన సమూహం చేయడం పూర్తిగా నిషేధమని, సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలను, మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులను నమోదు చేయబడతాయని తెలిపారు. చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 30 పోలీస్ ఆక్ట్ ప్రకారం శిక్ష అర్హులవుతారన్నారు. కార్యక్రమాలకు ముందస్తు దర ఖాస్తు, అనుమతులు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment