అతడికి సెల్యూట్‌.. నిజంగా రియల్‌ హీరో | CISF Personnel Saved Mans Life In Delhi Metro Station | Sakshi
Sakshi News home page

అతడికి సెల్యూట్‌.. నిజంగా రియల్‌ హీరో

Published Wed, Jan 20 2021 1:14 PM | Last Updated on Wed, Jan 20 2021 4:00 PM

CISF Personnel Saved Mans Life In Delhi Metro Station - Sakshi

వీడియో దృశ్యం

న్యూఢిల్లీ : అకస్మాత్తుగా నేలపై కుప్పకూలిపోయిన ఓ వ్యక్తికి సీపీఆర్‌ చేసి ప్రాణాలు రక్షించాడు ఓ సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది. ఈ సంఘటన ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జనక్‌పురికి చెందిన సత్యనారన్‌ అనే వ్యక్తి దబ్రీ మోర్‌ మెట్రో స్టేషన్‌లో ఉన్నట్టుండి నేలపై కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన అక్కడి సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే ఆయన దగ్గరకు వెళ్లాడు. నేలపై పడి ఉన్న సత్యనారన్‌కు సీపీఆర్‌(కార్డియోపల్మనరీ రెససిటేషన్‌) చేసి ప్రాణం రక్షించాడు. (ఆఫ్రికన్‌ బ్రహ్మానందం.. ఒసితా ఇహెమ్‌ )

అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘అతడికి నగదు బహుమతి ఇవ్వాలి’’.. ‘‘ఆ సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి సెల్యూట్‌, నిజంగా రియల్‌ హీరో’’..‘‘ ఓ విలువైన ప్రాణం కాపాడిన ఆ వ్యక్తికి ధన్యవాదాలు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement