27న ‘నిధి ఆప్కే నిఖత్‌’పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

27న ‘నిధి ఆప్కే నిఖత్‌’పై అవగాహన

Published Sat, Aug 24 2024 12:20 AM | Last Updated on Sat, Aug 24 2024 12:20 AM

-

కై లాస్‌నగర్‌: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఆధ్వర్యంలో (నిధి ఆప్‌కే నిఖత్‌) భవిష్యనిధి మీ వద్దకు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రావిడెంట్‌ ఫండ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం.సుబ్రహ్మణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్‌లో డీఆర్డీఏ కార్యాలయ సమావేశ మందిరంలో, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లోని కృష్ణవేణి ఉన్నత పాఠశాల, మంచిర్యాలలో డీఆర్డీఏ కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాల్లో, నిర్మల్‌ జిల్లాలో గాజులపేట ప్రిన్స్‌ హైస్కూల్‌లో ఈ కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య

నర్సాపూర్‌(జి): పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రానికి చెందిన సాయారెడ్డి (38) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం పంటచేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య సుమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని తండ్రి మోహన్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై హన్మాండ్లు పేర్కొన్నారు.

డెంగీతో వృద్ధురాలు మృతి?

బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఈఏ డాది తొలి డెంగీ మరణం నమోదైంది. ము న్సిపాలిటీ పరిధి 9వవార్డు సుబ్బారావుపల్లి గ్రామానికి చెందిన మేరుగు రామక్క (75)డెంగీతో శుక్రవారం మృతి చెందింది. వృద్ధురాలికి పది రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో వైద్యసిబ్బంది పరీక్షలు నిర్వహించి డెంగీ జ్వరంగా నిర్ధారించినట్లు గ్రామస్తులు తెలిపారు. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి లో చికిత్స పొందినప్పటికీ జ్వరం అదుపులో కి రాలేదు. పరిస్థితి మరింతగా విషమించి క న్ను మూసింది. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామంలో దోమల నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలని, వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని ఆ వార్డు కౌన్సిలర్‌ బూక్య రాములు నాయక్‌ డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement