జిల్లా ఏజెన్సీలకే బాధ్యతలివ్వాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఏజెన్సీలకే బాధ్యతలివ్వాలి

Published Sat, Aug 24 2024 12:26 AM | Last Updated on Sat, Aug 24 2024 12:26 AM

జిల్లా ఏజెన్సీలకే బాధ్యతలివ్వాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లా ఏజెన్సీలకే అవుట్‌ సోర్సింగ్‌ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్‌ మహిళా విభాగం నిర్మల్‌ అధ్యక్షురాలు సీహెచ్‌ భవాని కోరారు. శుక్రవారం ఆమె కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న ఏజెన్సీలను కాదని ప్రభుత్వం బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిన ఇతర జిల్లాల ఏజెన్సీలకు జిల్లా అవుట్‌ సోర్సింగ్‌ బాధ్యతలు అప్పగిస్తే నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఏ చిన్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినైనా మెరిట్‌, రోస్టర్‌ పాయింట్లతో తీసుకోకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు బనోద్‌ గోవింద్‌నాయక్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, నాయకురాళ్లు జలజ, రమ, శారద, పరిమళ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement