విద్యుత్‌శాఖలో ఉత్తమ పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌శాఖలో ఉత్తమ పురస్కారాలు

Published Sat, Aug 24 2024 12:22 AM | Last Updated on Sat, Aug 24 2024 12:22 AM

-

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో ఉద్యోగుల మధ్య స్నేహపూర్వక పోటీ పెంచి వివిధ పారామీటర్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు విద్యుత్‌ సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ‘బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఆఫ్‌ ది మంత్‌’ పేరిట ఏప్రిల్‌ నుంచి ప్రతీనెల బహుమతులు అందజేస్తున్నట్లు విద్యుత్‌ శాఖ మంచిర్యాల జిల్లా ఎస్‌ఈ ఎన్‌.శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. సప్‌లై మెయింటనెన్స్‌, డీటీఆర్‌ నిర్వహణ, వైపల్యాలను తగ్గించడం, విద్యుత్‌ అంతరాయం తగ్గించడం, వినియోగదారులందరికీ సత్వర సేవ, కొత్త సర్వీస్‌ కనెక్షన్ల మంజూరు, మీటర్ల బిగింపు, ఎనర్జీ అడిట్‌, కెపాసిటర్స్‌ని పెంచడం తదితర మెరుగైన చర్యలు తీసుకుంటూ సంస్థ మనగడకు తోడ్పడడం, వినియోగదారులకు అందుబాటులో ఉంటూ అంతరాయం లేని సరఫరా చేయడం వంటి అంశాలను పరిగణంలోకి తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లాలో బెల్లంపల్లి రూరల్‌ ఆపరేషన్‌ ఏఈ, ఉత్తమ అవార్డు, మేలో హాజీపూర్‌ ఆపరేషన్‌ ఏఏఈ సిబ్బందికి, మంచిర్యాల ఎస్‌ఈ, ఆపరేషన్‌ సిబ్బందికి ఉత్తమ అవార్డు, జూన్‌లో లక్సెట్టిపే ట ఏఈ ఆపరేషన్‌ సర్కిల్‌ పరిధి సిబ్బందికి, ఏడీఈ లక్సెట్టిపేట ఆపరేషన్‌ విభాగం సిబ్బందికి, మంచి ర్యాల ఎస్‌ఈ అపరేషన్‌ విభాగం సిబ్బందికి, జూలైలో ఏఈ ఆపరేషన్‌ బెల్లంపల్లి రూరల్‌ సిబ్బందికి ఉ త్తమ అవార్డుకు ఎంపికై నట్లు ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement