నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Published Sat, Aug 24 2024 12:26 AM | Last Updated on Sat, Aug 24 2024 12:26 AM

నిర్మ

గల్ఫ్‌గాయం.. తీరని దుఃఖం!
ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్తున్నవారిలో పలువురు అనారోగ్యంతో చనిపోతున్నారు. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతూ విగతజీవులై పెట్టెల్లో వస్తున్నారు.

శనివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2024

8లోu

రుణమాఫీ కోసం రాస్తారోకో

కుంటాల: అర్హులైన రైతులకు రుణమాఫీ చే యాలని మండలంలోని పెంచికల్‌పాడ్‌ గ్రామ రైతులు శుక్రవారం మండల కేంద్రంలోని క ల్లూరు–కుంటాల రహదారిపై రాస్తారోకో చేశా రు. తహసీల్దార్‌, వ్యవసాయశాఖ కార్యాల యాల ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. అన్ని అర్హతలున్న తమకు రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఇ న్‌చార్జి ఏవో రవి, తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: పంచాయతీ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహిస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన వెలువడే అవకాశముంది. అలాగే ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా అధికారులు ఎన్నికల పనుల్లో నిమగ్నమయ్యారు.

పంచాయతీరాజ్‌ చట్టం 2018 ప్రకారం..

తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం–2018 ప్రకారం పంచాయతీ అధికారులు ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. గ్రామపంచాయతీల్లోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారు చేసేందుకు గ్రామపంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పనులు ప్రారంభించారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏ క్షణంలోనైనా ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉండడంతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలను పోలింగ్‌ బూత్‌ల వారీగా సిద్ధం చేసి ఉంచారు. ఇప్పుడు గ్రామపంచాయతీలోని వార్డులవారీగా జాబితా తయారు చేయాల్సి ఉంది. దీంతో గతంలో ఉన్న ఓటర్లతోపాటు మార్పులు, చేర్పులతో వార్డులవారీగా జాబితాలు రూపొందించాల్సి ఉంది. మేజర్‌ పంచాయతీ అయితే వార్డుకు 625 ఓట్లు కేటాయించనున్నారు. పంచాయతీ పరిధిలోని ఓటర్లను ప్రతీ వార్డుకు సమానంగా విభజించనున్నారు. ఓటర్ల జాబితా రూపకల్పనపై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కూడా ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

బీసీ గణన చేస్తే..

బీసీ గణన తెరపైకి రాగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఎప్పుడు వస్తే అప్పుడే అన్నట్లుంది. ఒకవేళ బీసీ గణన చేస్తే దానికి అనుగుణంగా సర్పంచుల రిజర్వేషన్లూ మారే అకాశముంది. ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలు తీసుకునే నిర్ణయం కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. గతంలో మాది రిగానే ఈసారి కూడా జిల్లాలోని పంచాయతీలను మూడు విడతలుగా విభజించి ఎన్నికలు నిర్వహించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 396 పంచాయతీల్లో స్థానిక పరిస్థితులు, శాంతి భద్రతలు, ఎన్నికల సిబ్బంది, అధికారుల పర్యవేక్షణ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే.. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై మరో కొద్ది రోజుల్లో స్పష్టత రానుందని అధికారులు చెబుతున్నారు.

రిజర్వేషన్ల మార్పు ఉంటుందా?

న్యూస్‌రీల్‌

ఓటర్ల జాబితా షెడ్యూల్‌ ఇలా..

సెప్టెంబర్‌ 6న ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలు సిద్ధం చేయాల్సి ఉంది.

సెప్టెంబర్‌ 9న జిల్లా, 10న మండల స్థాయిలో వివిధ పార్టీలతో సమావేశాలు నిర్వహించి ఓటరు జాబితాలపై అభిప్రాయాలు స్వీకరించనున్నారు.

సెప్టెంబర్‌ 7 నుంచి 13వ తేదీ వరకు జీపీ నిబంధనల ప్రకారం అభ్యంతరాలు, ఓటర్ల సర్దుబాటు, తప్పొప్పులు సరిచేసుకునే అవకాశం ఉంటుంది.

19న డిస్పోజల్‌ ఆఫ్‌ అభ్యంతరాలు డీపీవోకు అందించాలి.

21వ తేదీన గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల ఫొటోలతో కూడిన తుది జాబితాను ప్రదర్శనకు పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఓటరు లిస్ట్‌ తయారీకి షెడ్యూల్‌ ఖరారు

వార్డుల వారీగా ఓటర్ల విభజన షురూ

ఓటర్ల శాతంతోనే రిజర్వేషన్లు అమలు!

ఎన్నికల విధుల్లో అధికారులు నిమగ్నం

జిల్లాలో 396 గ్రామ పంచాయతీలు

ఏ వార్డులో ఎంతమంది.. ఏ సామాజిక వర్గానికి చెందినవారున్నారు.. గ్రామ మొత్తంలో ఏ వర్గం వారు అధిక మొత్తంలో ఉన్నారనే అంశాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు మార్చే అవకాశముంది. ముందుగా వార్డులవారీగా విభజన చేసిన తర్వాత ఆ వార్డులో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారనేది కూడా విభజించనున్నారు. దీంతో వార్డులు, గ్రామపంచాయతీల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. గతంలో ఉన్న రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
నిర్మల్‌1
1/2

నిర్మల్‌

నిర్మల్‌2
2/2

నిర్మల్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement