బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతల స్వీకరణ

Published Sat, Aug 24 2024 12:26 AM | Last Updated on Sat, Aug 24 2024 12:26 AM

బాధ్య

నిర్మల్‌టౌన్‌: జిల్లా క్రీడల అధికారిగా బీ శ్రీకాంత్‌రెడ్డి శు క్రవారం తన కా ర్యాలయంలో బా ధ్యతలు స్వీకరించారు. ఇదివరకు కరీంనగర్‌ డీవైఎ స్వోగా బాధ్యతలు నిర్వర్తించి నిర్మల్‌కు బదిలీ పై వచ్చారు. ఈ సందర్భంగా పలువురు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ అభినవ్‌ అభిలాషను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీకాంత్‌రెడ్డి పూలమొక్క అందజేశారు.

రేపు క్రికెట్‌ జట్ల ఎంపిక

నిర్మల్‌చైన్‌గేట్‌: తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 25న అండర్‌–16, 19 విభాగాల్లో జిల్లా క్రికెట్‌ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు టీసీఏ జిల్లా కోచ్‌ రామరాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ని ర్మల్‌ పట్టణంలోని గండి రామన్న సాయిబాబా ఆలయ సమీపంలోని క్రికెట్‌ శిక్షణ కేంద్రంలో ఎంపిక పోటీలుంటాయని పేర్కొన్నారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు, పదో తరగతి మెమో, బోనాఫైడ్‌, క్రికెట్‌ కిట్‌, వైట్‌డ్రెస్‌తో రావాలని, పూర్తి వివరాలకు 9912939724 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

నిజాయతీ చాటుకున్న బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌

భైంసాటౌన్‌: భైంసా పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ నిజాయతీ చాటుకున్నారు. స్థానిక వైష్ణవి పెట్రోల్‌పంపు మేనేజర్‌ మక్కాజి లక్ష్మణ్‌ శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, సెల్‌ఫోన్‌, పర్సు పోగొట్టుకున్నాడు. అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్‌ కానిస్టేబు ల్‌ చంద్రశేఖర్‌కు అతడి మొబైల్‌ ఫోన్‌, పర్సు దొరికాయి. ఈ మేరకు సీఐ రాజారెడ్డికి సమాచారమిచ్చారు. దీంతో బాధితుడి వివరాలు తెలుసుకుని సెల్‌ఫోన్‌తోపాటు పర్సులోని రూ.1,500, ఏటీఎం, ఇతర కార్డులు అందజేశారు. నిజాయతీ చాటుకున్న కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ను సీఐ అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బాధ్యతల స్వీకరణ
1
1/1

బాధ్యతల స్వీకరణ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement