బ్రహ్మేశ్వర ‘ఎత్తిపోతల’కు మరమ్మతులు
లోకేశ్వరం: ఎత్తిపోతల పథకాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు పంటలు పండించుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. గురువారం మండలంలోని కన్కపూర్లోని బ్రహ్మేశ్వర ఎత్తిపోతల పథకానికి మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్యాన్ బోర్డుకు మరమ్మతులు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, పైప్‌లైన్ లీకేజీలు, నీటిని సరఫరా చేసే పంపుల మరమ్మతుల కోసం రూ.కోటి 42 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. పనులు నాణ్యతగా చేట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ అనిల్, భైంసా మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాజేశ్‌బాబు, నాయకులు భోజన్న, భాస్కర్, సాయాగౌడ్, మహేందర్, దేవేందర్, ఆనందర్‌రావు, గంజాల గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment