పకడ్బందీగా కుటుంబ సర్వే
● ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వేపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయాతో కలిసి శనివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమగ్ర కుటుంబసర్వేకు తీసుకుంటున్న చర్యలపై అధికారులు, కలెక్టర్లతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను అధి కారులు సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. సర్వేపై ప్రజలకు అనేక సందేహాలు వస్తుంటాయని నివృత్తి చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఎలాంటి సందేహాలున్నా ఎన్యూమరేటర్లు కలెక్టర్ల దృష్టికి తేవాలని సూచించారు. సర్వే ప్రక్రియలో మంత్రులు, ఎమ్మెల్యేలు భాగస్వాములు అయ్యేలా ఆహ్వానించాలన్నారు. సమగ్ర కుటుంబ సమాచారం సేకరణతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. సర్వే సమాచారం గ్రామస్థాయిలోని ప్రతీ ఇంటికి చేరే విధంగా ప్రచారం నిర్వహించాలన్నా రు. గ్రామ, పట్టణాల ప్రధాన కూడళ్లలో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. హౌస్ లిస్టింగ్ సర్వే దిగ్వి జయంగా నిర్వహించారని, అదే ఉత్సాహంతో సర్వే పూర్తయ్యేవరకు పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
సర్వే నిబద్ధతతో నిర్వహించాలి..
అనంతరం అధికారులతో కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే ప్రక్రియను నిబద్ధతతో నిర్వహించాలన్నారు. ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తా వు లేకుండా ప్రజల నుండి కచ్చితమైన సమాచారం నమోదు చేయాలన్నారు. సర్వే ప్రక్రియను సూపర్‌వైజర్లు, మండల ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. సర్వేకు ముందు రోజు గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. ప్రజల నుంచి సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి డీఆర్వో రత్నకళ్యాణి, సీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు రాజేశ్వర్‌గౌడ్, శంకర్, అంబా జీ, శ్రీనివాస్, మోహన్‌సింగ్, ఏడీ మార్కెటింగ్ శ్రీని వాస్, ఏడీ సర్వే లాండ్ రికార్డ్ రాథోడ్ సుదర్శన్, మున్సిపల్ కమిషనర్లు ఖమర్ అహ్మద్, రాజేశ్‌కుమార్, మనోహర్, అధికారులు పాల్గొన్నారు.
సర్వేను బహిష్కరించడం సరికాదు
కొన్ని గ్రామాలు సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించడం సరికాదని కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేను బహిష్కరించినా, అడ్డుకునే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. సర్వేకు అందరూ సహకరించాలని సూచించారు. సర్వే ఆధారంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబడతాయని తెలిపారు. సర్వేలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచించారు. సమగ్ర కుటుంబ సర్వే ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని, సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని పేర్కొన్నారు. సందేహాలు ఉంటే క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment